Telugu Desam Party (TDP) MLA Bode Prasad got his head tonsured to express dissatisfaction over the funds allocated to the state of Andhra Pradesh by the Centre. Bode Prasad took this step during the Andhra Pradesh bandh protest being carried out on Thursday.
కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా గురువారం ఆంధ్రప్రదేశ్ బంద్‌లో దాదాపు అన్ని పక్షాలు పాల్గొన్నాయి. బిజెపి మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆందోళనలో పాలు పంచుకున్నారు.
పెనమలూరు శాసనసభ్యుడు బోడె ప్రసాద్ వినూత్న నిరసన చేపట్టారు. ఉయ్యూరు సెంటర్‌లో కూర్చుని ఆయనయ గుండు గీయించుకుని నిరసన తెలిపారు. ఎపికి న్యాయం చేయాలంటూ గత ఐదు రోజులుగా టిడిపి ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లోనూ నిరసన తెలియజేస్తున్నా కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం రాష్ట్రాన్ని హేతురహితంగా విభజించి ఎపి ప్రజల కు నిలువ నీడ లేకుండా కట్టుబట్టలతో బయటకు గెంటేసిందని, ఇప్పుడు ఎన్డీఎ ప్రభుత్వం ఎపికి రావాల్సిన నిధులు విడుదల చేయకుండా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని బోడె ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు