Rashmi Gautam has shocked everyone by saying that she is ready to do the sequel of Guntur Talkies. when one of Rashmi’s fan on Twitter asked her whether she would do RGV’s GST2, Rashmi immediately said she would prefer doing Guntur Talkies 2 and that too if it is directed by Praveen Sattaru.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్'(జీఎస్టీ) షార్ట్ ఫిల్మ్ ఓ సంచలనం. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో తెరకెక్కించిన ఈచిత్రానికి మంచి స్పందన రావడంతో 'జీఎస్టీ-2' కూడా తీయడానికి సిద్ధమయ్యారు వర్మ. అయితే యాంకర్ రష్మి తాజాగా సోషల్ మీడియా ద్వారా .... తాను 'జిఎస్టీ-2'లో నటించడానికి సిద్ధమే అని ప్రకటించినట్లు వార్తలు రావడం వివాదానికి దారి తీసింది.
రష్మి తన ట్విటర్ ఫాలోవర్స్‌తో బుధవారం చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి రామ్ గోపాల్ వర్మ ఆఫర్ చేస్తే ‘GST 2'లో నటిస్తారా?అని ప్రశ్నించారు. దానికి రష్మి స్పందిస్తూ ‘I'll do a GT 2 if @praveenSattaru directs it' అంటూ సమాధానం ఇచ్చారు. GT 2 అంటే ‘గుంటూరు టాకీస్ 2' అని అర్థం.
అయితే రష్మి ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్న నెటిజన్లు ఆమె ‘GST 2'లో చేయడానికి నేను సిద్ధమైంది అంటూ రకరకాల కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. కొన్ని వెబ్ సైట్లలో కూడా రష్మి ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్-2' చేయడానికి ఓకే చెప్పింది అంటూ వార్తలు వచ్చాయి.
తన ట్వీట్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకోవడంతో వెంటనే రష్మి దాన్ని డిలీట్ చేసింది. నేను GST 2 చేస్తాను అని చెప్ప లేదు GT 2 చేస్తాను అని మాత్రమే చెప్పాను అని వివరణ ఇచ్చారు.
గతంలో రష్మి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ‘గుంటూరు టాకీస్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనే రష్మి ఎవరూ ఊహించని విధంగా అందాల ఆరబోత చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముద్దు సీన్లు, పడకగది సీన్లు, బికినీ సీన్లతో ఆమె బాగా పాపులర్ అయ్యారు.