If a Hindu marries twice, he goes to jail. There should be punishment for him. You did not think how his family will survive," PM Modi said in Rajya Sabha
ట్రిపుల్ తలాక్ విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఘాటుగా స్పందించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్, మిత్రపక్షాలపై విరుచుకుపడ్డారు. 'ట్రిపుల్ తలాక్' బిల్లు ఏ ఒక్క కమ్యూనిటీనో ఉద్దేశించినది కాదని, ఇదే నేరం కింద హిందూ పురుషులను కూడా జైలుకు పంపుతామని హెచ్చరించారు. బిల్లు ఆలస్యానికి కాంగ్రెస్సే కారణమని అన్నారు.
కాంగ్రెస్ నేతలు ప్రతీదానిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, 'స్వచ్ఛ భారత్', 'మేక్ ఇన్ ఇండియా', 'సర్జికల్ స్ట్రైక్స్, 'యోగా డే'.. ఇలా అన్నింటికీ అడ్డంకులు సృష్టించడమే కాంగ్రెస్ పనంటూ మండిపడ్డారు. వాటిని విమర్శించే స్వేచ్ఛ వారికి ఉందని, అయితే 'ట్రిపుల్ తలాక్' బిల్లుకు రాజ్యంగ హోదా దక్కుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రధాని డిమాండ్ చేశారు.