AP Need To Overcome Upcoming Financial Challenges : RBI

2018-02-08 557

Financial analysts of Andhra Pradesh says that the financial condition of the state is very critical and the money management is becoming extremely tough. Due to the difficult economic conditions, AP has already utilized almost all the financial prospects of the RBI. There is worried situation about how the AP will overcome upcoming financial challenges.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా ఓవర్‌డ్రాఫ్ట్‌(ఒడి) స్థితిలోనే కొనసాగుతోరది. గతంలో ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే కనిపించే ఒడి గత కొంత కాలంగా తరుచు కనిపిస్తోంది. దీంతో ఎపి ఆర్థిక పరిస్థితి ప్రమాదకర పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తుండగా... మరోవైపు రిజర్వ్‌ బ్యాంకు కూడా ఇదే విషయమై ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఇటీవల కొన్నినెలలుగా రాష్ట్ర ఖజానా తరచూ ఒడిలో పడిపోతుండటం ఎపికి ఆర్థికపరమైన ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తాజాగా ఎపికి 1563 కోట్ల రూపాయల వరకు ఒడి ఉన్నట్లు గుర్తించారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఎపి ప్రభుత్వం జనవరి నెల రెండున ఒడికి వెళ్లింది. డిసెంబర్ నెల కూడా పెద్ద మొత్తంలో ఒడి కొంచెంకొంచెంగా తగ్గుతూ వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో మళ్లీ ఫిబ్రవరిలో ఒడికి వెళ్లాల్సి రావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన నెలకొంటోంది.
ప్రస్తుత మూడునెలల వ్యవధిలో ఎపి 13 రోజులు ఒడిలో ఉండటం గమనించాల్సిన విషయం. పైగా జనవరి నుంచి చూసుకుంటే 33 రోజుల్లో 13 రోజులు రాష్ట్రం ఒడిలో కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. కారణం ఓడీలో 14 రోజులపాటు నిరంతరంగా ఉండకూడదు. రిజర్వ్‌ బ్యాంకుకు సంబంధించి ఈ మార్గదర్శకాలు అత్యంత ప్రాధన్యత కలిగినవి కాగా...రాష్ట్రాలు కొన్నినిబంధనలు పాటించకుంటే రావాల్సిన నిధులను కూడా నిలిపివేయడం జరుగుతుంది.