Niharika Konidela responds on link up rumours with Naga Shaurya and her cousing Sai Dharam Tej, response to her latest Tamil release "Oru Nalla Naal Paathu Solren" and upcoming movie "Happy Wedding".
కొణిదెల నిహారిక 'ఒక మనసు' చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ మెగాడాటర్ 'ఒరు నల్ల నాల్ పత్తు సొల్ రే' అనే చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. జనవరి చివరి వారంలో విడుదలైన ఈచిత్రం అక్కడ మంచి విజయం అందుకుంది. ఈ సందర్భంగా నిహారిక ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
తమిళంలో విడుదలైన నా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడ ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. హైదరాబాద్ లో పెదనాన్న సినిమా ఫస్ట్ డే క్రౌడ్ ఎంత ఎక్జైటింగ్‌గా ఉంటుందో అలాంటి ఎగ్జైట్మెంట్ అక్కడ చూశాను అని నిహారిక తెలిపారు తెలిపారు.
ఈ మూవీలో బాబాయ్ స్టైల్ కొంచెం ట్రై చేశాను. నిజానికి అది పవర్ స్టార్ స్టైల్ కాదు. కాటమరాయుడు సినిమాలో ఆయన మీసం తిప్పినట్లు ఏదో ట్రై చేశాను. నాకు మీసం లేకున్నా ఆయనలా ట్రై చేశాను.... అని నిహారిక తెలిపారు.
మా ఫ్యామిలీలో కొందరికి సెకండ్ మూవీ సెంటిమెంట్ ఉన్న మాట నిజమే. అన్నయ్య వరుణ్ తేజ్ సెకండ్ మూవీ హిట్. అదే విధంగా రామ్ చరణ్ అన్నయ్య సెకండ్ మూవీ ‘మగధీర' కూడా చాలా పెద్ద హిట్. తెలుగులో నా సెకండ్ మూవీ విడుదల కాలేదు. కెరీర్లో చూసుకుంటే తమిళ మూవీ నా రెండోది. ఇది మంచి హిట్టయింది. అలా చూసుకుంటే నాకు కూడా వారి మాదిరిగానే సెకండ్ మూవీ కలిసొచ్చిందని చెప్పొచ్చు... అని నిహారిక వ్యాఖ్యానిచారు.
మీ మీద ఈ మధ్య చాలా రూమర్స్ వచ్చాయి. మీ తొలి సినిమా కోస్టార్ నాగ శౌర్యతో మీకు లింక్ పెట్టి రూమర్స్ స్ప్రెడ్ చేశారు, వీటిని మీరు ఎలా తీసుకుంటారు? అనే ప్రశ్నకు నిహారిక స్పందిస్తూ... ‘ఇండస్ట్రీకి వస్తే ఇలాంటి రూమర్స్ వస్తాయని తెలుసు, అన్నిండి సిద్ధపడే వచ్చాను' అని నిహారిక తెలిపారు.