Modi took a dig at Congress leader Renuka Chowdhury who laughed out loud during the Prime Minister's speech in Rajya Sabha. When Rajya Sabha Chairman Venkaiah Naidu objected to Chowdhury's interruption, Modi said, "Sabhapati Ji, I request you don't say anything to Renuka ji. After Ramayan serial, we are now getting the opportunity to hear such a laugh
రాజ్యసభ కాంగ్రెసు సభ్యురాలు రేణుకా చౌదరిపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రామాయణంలోని ఏ పాత్రతో రేణుకా చౌదరి సరిపోలుతారా, రామాయణంలోని ఏ పాత్రకు ఆమె సరిపోతారనేది మోడీ ఉద్దేశం అనే ప్రశ్నలు ముందుకు వచ్చాయి.
ఆమెను ఏ పాత్రతో పోల్చారో స్పష్టత ఇవ్వకుండా ప్రధాని మోడీ రేణుకా చౌదరిపై వ్యాఖ్య చేశారు. బుధవారం రాజ్యసభలో తన ప్రకటనకు ఫక్కున నవ్విన రేణుకా చౌదరిని ఉద్దేశించి మోడీ వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు మోడీ బుధవారం రాజ్యసభలో జవాబిస్తూ వాజ్‌పేయి హయాంలో ఆధార్ కార్డుకు బీజం పడిందని అన్నారు. ఆ సమయంలో ఎవరో గట్టిగా నవ్విన శబ్దం వినిపించింది అంతా అటువైపు చూశారు.
నవ్వు వినిపించిన వైపు సభ్యులంతా చూశారు. ఆ నవ్వు రేణుకా చౌదరిదని గుర్తించారు. ఈ సమయంలో చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు జోక్యం చేసుకుని - ఒక నిమిషం ప్రసంగాన్ని ఆపాలని ప్రధానికి సూచిచి రేణుకా చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైంది మీకు, ఇలాంటి ప్రవర్తన సరి కాదని అన్నారు.
సభాపతీజీ.. రేణుకను అడ్డుకోకండి. రామాయణం సీరియల్ తర్వాత అంతటి నవ్వును వినే భాగ్యం మనకు ఈ రోజే దక్కిందని అన్నారు. దాంతో రామాయణంలోని ఏ పాత్రతో రేణుకా చౌదరిని పోల్చారనే చర్చ జరిగింది. అయితే, దానిపై నెటిజన్లు వ్యాఖ్యానిస్తూ - శూర్పనఖతో పోల్చారని అంటున్నారు.