YS began the 81st day of the Praja Sankalpa Yatra from Annareddypalem crossroad in Sangam mandal of Atmakur constituency.
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 81వ రోజు మంగళవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ రైతులు అన్యాయమైన పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు పగటిపూటే ఉచితంగా 9 గంటల పాటు కరెంట్ ఇస్తాం. ప్రతీ రైతుకు వడ్డీ లేకుండా రుణాలిప్పిస్తాం అని జగన్ అన్నారు. ఏడాదికి రూ.12,500 పెట్టుబడి కింద అందిస్తాం. ముందే గిట్టుబాటు ధర కల్పిస్తాం. రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే నా లక్ష్యం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు