Modi "Political" Speech In Lok Sabha : Why No Jobs, Farmers Etc Statements ?

2018-02-07 1

Narendra Modi's speech in Lok Sabha today was slammed by the Congress, with party chief Rahul Gandhi questioning his silence on the Rafale jet deal, and former party president Sonia Gandhi asking why no statement was made on creating more jobs.

లోకసభలో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ విభజన మొదలు, యూపీయే హయాంలో ప్రధాని మోడీ కేవలం నిమిత్తమాత్రుడే అంటూ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చూపిస్తామన్నారు. బీజేపీ గెలిస్తే ఆధార్ పక్కన పెట్టేస్తారని ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. సొంత లాభం కోసం దేశాన్ని విభజన చేసిందన్నారు. ఇప్పుడు దానిని తాము మరింత శాస్త్రీయంగా వాడుతున్నామని చెప్పారు. నిరుపేదలకు కూడా ఆధార్ ద్వారా మేలు చేయాలని తాము చూస్తున్నామని చెప్పారు. ఇప్పుడు మీరే ఆధార్‌ను వ్యతిరేకిస్తున్నారన్నారు. మీరు తెచ్చిన ఆధార్‌తో నన్ను ఇరుకున పెట్టాలని చూశారని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం హయాంలో ఎక్కడా అవినీతి జరగడం లేదన్నారు.
ఈ మూడేళ్లలో మేం ఎన్నో చేశామని ప్రధాని మోడీ అన్నారు. రోజులు మారాయని, ఇప్పుడు యువత ఉద్యోగాల వెంట పడటం లేదని, వాళ్లు స్టార్టప్‌లు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రధాని ముద్రా యోజన ఈ మధ్య తరగతి కలలు నెరవేర్చడానికి కృషి చేస్తోందన్నారు. అందుకే రూ.10 లక్షల కోట్ల రుణాల పంపిణీలో ఎక్కడా అవినీతి కనిపించలేదన్నారు. రుణాలు పొందిన లబ్ధిదారుల్లో 3 కోట్ల మంది మొదటిసారి రుణాలు తీసుకున్నవారే అన్నారు.
21వ శతాబ్దం తమదే అని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో ఏవియేషన్ పాలసీ అనేది లేదన్నారు. వారిది ఎద్దులబండి పాలసీ అని చెప్పారు. వితంతువులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల పేర్లు చెప్పి ప్రభుత్వ సొమ్మును మీ సర్కార్ దోచేసిందన్నారు. చిన్న పట్టణాలకు అద్భుతమైన విమానాశ్రయాలు తెచ్చామన్నారు. దేశానికి రెక్కలు తొడిగామన్నారు.