Actress And Former MP Ramya Trolled Over Fake Accounts

2018-02-07 1

Congress Social media chief Divya Spandana alias Ramya in a video teaching people on how to create fake accounts in social media. And she also said, there is nothing wrong in having many accounts. Here are twitter reactions on her video.

ప్రధాని నరేంద్ర మోడీ నిషాలో బెంగళూరులో బహిరంగ సభలో మాట్లాడారని వివాదాస్పద ట్వీట్ చేసిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్, బహుబాష నటి రమ్య ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ ఎలా ప్రారంభించాలి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటూ పాఠం చెబుతున్న ఓ వీడియో బయటకు వచ్చి వైరల్ అయ్యింది. స్వీస్ బ్యాంక్ లో 60 ఏళ్లుగా నకిలి అకౌంట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రమ్యకు నకిలీ అకౌంట్స్ గురించి బాగా తెలుసు, రాహుల్ గాంధీ ట్వీట్ ల లైక్ ల కోసం ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, నటి రమ్య ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మీరు ఈ రోజు ఒక్కొక్కరు మూడు అకౌంట్లు ఓపెన్ చెయ్యాలని, వాటిని ఎలా ఉపయోగించాలో తాను చెబుతానని, తనకు రెండు మూడు అకౌంట్లు ఉన్నాయని మైక్ లో చెబుతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదానికి దారితీసింది.
రమ్య ఇటీవల అనేక వివాదాలకు కారణం అవుతున్నారని, ఆమెను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ పదవిలో ఆ పార్టీ నాయకులు ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదని రవిప్రసాద్ అనే వ్యక్తి ట్విట్ చేశారు. రమ్యను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని రవిప్రసాద్ డిమాండ్ చేశారు.
నటి రమ్య ఒక్కొక్కరు సోషల్ మీడియాలో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ప్రారంభించాలని చెప్పారు. అంతే కాని నకిలీ ఖాతాలు ప్రారంభించాలని ఎక్కడా చెప్పలేదని అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఆమెను సమర్థించారు. ఈ విషయాన్ని పెద్ద రాద్దాతం చేస్తున్నారని అరుణ్ కుమార్ అంటున్నారు.