KVP Ramachandra Rao Suspended for Protesting Inside Parliament Houses. Andhra Pradesh Telugu Desam MPS and ysrcp mps continuing protest in Parliament on Wednesday also.
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు బుధవారం రాజ్యసభ నుంచి ఒక్కరోజు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కేవీపీ పదేపదే నిరసన తెలుపుతోన్న విషయం తెలిసిందే. సభకు అడ్డుపడుతున్నారని చెబుతూ కేవీపీని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేశారు, టీడీపీ, వైసీపీ ఎంపీలు ఉభయ సభల్లో నిరసన తెలుపుతున్నారు. వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైయస్ అవినాశ్ రెడ్డిలు అంతకుముందు గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. సోమ, మంగళ వారాలు అదే ప్రాంతంలో టీడీపీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు.