Manjima Mohan Tweet Became Hot Topic In Social Media

2018-02-06 1

Manjima Mohan recently made sensational comments on crimes on women . She took to twitter and tweets on that issue. The tweet became hot topic in social media

నాగచైతన్య చిత్రం సాహసం శ్వాసగా సాగిపో గుర్తుందిగా.. ఆ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ మంజిమ మోహన్ హీరోయిన్ గా నటించింది. కానీ ఆచిత్రం ప్లాప్ కావడంతో మంజిమకు మరో అవకాశం రాలేదు. తమిళంలో కూడా మంజిమకు అరా కోర అవకాశాలే వస్తున్నాయి. తాజగా మంజిమ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి మంజిమ హాట్ కామెంట్స్ చేసింది.
తాజాగా మంజిమ చేసిన ఓ ట్విట్ వైరల్ గా మారింది. మహిళలని సెక్స్ వస్తువుగా చూసినంత కాలం పెప్పర్ స్ప్రే కూడా కాపాడలేదని వ్యాఖ్యానించింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు. లైంగిక దాడుల్ని ఉద్దేశించి మంజిమ ఈ వ్యాఖ్యలు చేసింది.
మంజిమ చేసిన ట్విట్ కు ఓ నెటిజన్ హద్దు మీరి ప్రవర్తించాడు. అయితే నీ శీలాన్ని కాపాడుకోవడానికి త్వరగా పెళ్లి చేసుకో అంటూ రిప్లై ఇచ్చాడు. ఇది శీలానికి సంబందించిన అంశం కాదని, ఆత్మగౌరవానికి సంబంధించినదని హుందాగా అతడికి కౌంటర్ ఇచ్చింది.
మంజిమ అభిప్రయం సరైనదే అని ఆమెకు ఇతర అభిమానులు, నెటిజన్లు మద్దత్తు తెలుపుతున్నారు. హద్దుమీరి ప్రవర్తించిన అతడికి చురకలు అంటిస్తునారు. చిన్నపిల్లపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే వారు కూడా పెళ్లి చేసుకోవాలా అని కౌంటర్ ఇచ్చారు.