Sai Pallavi Remuneration News Going Viral

2018-02-06 2,569

Sai Pallavi demanding shocking remuneration for new movie. This news is going viral in social media. After Fidaa and MCA movies Sai Pallavi became crazy heroine in Tollywood.

సాయిపల్లవి ఇప్పుడు సౌత్ లో ఒక సెన్సేషన్. అచ్చతెలుగు పల్లెటూరు ముద్దుగుమ్మలా కనిపించే ఈ మలయాళీ భామ ఇప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా మారింది. టాలీవుడ్ లో కూడా సాయిపల్లవి హవా కొనసాగుతోంది. ఫిదా, ఎంసీఏ వంటి వరుస విజయాలతో సాయిపల్లవి దూసుకుని పోతోంది. ప్రస్తుతం సాయిపల్లవి టాలీవుడ్ మొత్తానికి దిమ్మ తిరిగేలా చేసింది. దీనికి కారణం ఆమె రెమ్యునరేషన్ విషయంలో వస్తున్న వార్తలే. ఇప్పుడు దీని గురించే టాలీవుడ్ మొత్తం చర్చ జరుగుతోంది.
సాయిపల్లవి శర్వానంద్ తదుపరి చిత్రంలో నటించడానికి రూ 1.5 కోట్లు డిమాండ్ చేసిందట. ఇప్పుడు ఈ వార్తే ఇండస్ట్రీ మొత్తం చక్కర్లు కొడుతోంది. సాయిపల్లవి ఒకేసారి అంత మొత్తంలో పారితోషకం డిమాండ్ చేయడంతో సదరు నిర్మాతతో పాటు, శర్వానంద్ మరియు చిత్ర యూనిట్ కి చుక్కలు కనిపించాయి.
సాయిపల్లవికి క్రేజ్ తో పాటు వివాదాలు కూడా ఉన్నాయి. సాయిపల్లవి సెట్ లో చిత్ర యూనిట్ లో వాగ్వాదానికి దిగుతుందనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి.
ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ యువ హీరో నాగశౌర్య సాయిపల్లవి గురించి హాట్ కామెంట్స్ చేశాడు. సాయిపల్లవి వివాదాల గురించి వస్తున్న వార్తలు నిజమే అని తేల్చి చెప్పాడు.
సాయిపల్లవి ఇతర స్టార్ హీరోయిన్లందరికంటే భిన్నం. స్కిన్ షోకు సాయిపల్లవి దూరం. కేవలం తన సహజ అందం, అభినయంతోనే కుర్రకారుని సైతం కట్టిపడేయగలదు. ఫిదా, ఎంసీఏ వంటి చిత్రాలే సాయిపల్లవి టాలెంట్ కు ఉదాహరణ.