ప్రతి భారతీయుడి జీవితంలో ఆధార్ అనేది కీలక గుర్తింపుగా మారిపోయింది. ఆధార్ కార్డ్ తీసుకునే ప్రతిఒక్కరూ (వయసును బట్టి) తప్పనిసరిగా తమ మీ వేలిముద్ర అలానే రెటీనల్ స్కాన్ డేటాను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధమైన డేటాను టెక్నికల్ పరిభాషలో బయోమెట్రిక్ డేటా అని పిలుస్తారు.ఎంతో విలువైన ఈ బయోమెట్రిక్ వివరాలను తమ అనుమతి లేకుండా తీసుకుని దుర్వినియోగపరిచారంటూ కొందరు ఆరోపించటంతో ఆధార్ బయోమెట్రిక్ అంత సురక్షితం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. UIDAI సర్వర్లలో లాక్ అయి ఉండే బయోమెట్రిక్ సమాచారాన్ని మరింత గోప్యంగా ఉంచుకోవాలంటే దానిని లాక్ చేసుకోవటం ఉత్తమమైన మార్గం. ఇలా చేయటం ద్వారా మీ బయోమెట్రిక్ డేటాను వేరొకరు యాక్సిస్ చేసుకునే అవకాశం ఉండదు. మీకు అవసరమైనపుడు మాత్రమే అన్‌లాక్ చేసుకుని, అవసరం లేనపుడు లాక్ చేసుకోవచ్చు. యూజర్ తన Aadhaar biometric డేటాను లాక్ చేయటం ద్వారా ఆధార్ సంబంధిత లావాదేవీలు అలానే రిక్వస్ట్ లను one-time password ఆధారంగానే మేనేజ్ చేయగలుగుతారు