Jabardasth Phani Revealed Shocking Facts About A Female Director

2018-02-06 4

Jabardasth Phani has revealed many sensational facts about the Telugu film industry.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని దూసుకెళుతున్న యాక్టర్లలో జబర్దస్త్ ఫణి ఒకరు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ కు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.
తాను ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలైందని, కేవలం జబర్దస్త్ వల్లనే తన కెరీర్ టర్న్ అయిందని, అదే తన కెరీర్లో పెద్ద మైల్ స్టోన్ అని ఫని తెలిపారు. జబర్దస్త్ లేక పోతే తాను లేను అని స్పష్టం చేశారు.
ఒకప్పుడు ఇండస్ట్రీలో టాలెంట్ చూసేవారు. ఏదైనా పాత్ర ఉంటే పలానా యాక్టరే కావాలని తీసుకునేవారు. కానీ ఇపుడు అలా లేదు. పది వేలకు, ఐదు వేలకు యాక్టర్లు వస్తారా? అని చూస్తున్నారు. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది అని ఫణి తెలిపారు.
జబర్దస్త్ నుండి ఎందుకు బయటకు వచ్చారు? అనే ప్రశ్నకు సమాధానం నా వద్ద కూడా లేదు. కారణం ఏమిటో నాకు కూడా ఇప్పటి వరకు తెలియలేదు. నేను బయకు రావడానికి అభి, ఆది కారణం అనే ప్రచారంలో నిజం లేదని ఫణి తెలిపారు. వారిద్దరూ తనకు మంచి స్నేహితులు అని తెలిపారు
జబర్దస్త్ కామెడీ షోలో వల్గారిటీ ఎక్కువయిందనే విమర్శలపై మాట్లాడుతూ.... ఈ షో చూడాలని ఎవరూ ఎవరినీ బలవంత పెట్టడం లేదు. అందరికీ ఈ షో నచ్చింది కాబట్టే ఇంత పెద్ద హిట్టయింది. ఇష్టం లేని వారు ఈ షో చూడటం మానేయండి, టీవీ రిమోట్లో వేరే ఛానల్ పెట్టుకుని చూడండి అంటూ ఫణి ఉచిత సలహా ఇచ్చారు.
నాకు ఓ చిన్న సినిమాలో అవకాశం వచ్చింది. ఆ చిత్రానికి లేడీ ప్రొడ్యూసర్, లేడీ డైరెక్టర్. వాళ్లు అంతా ఒకేనా? అని అడిగారు...... రెమ్యూనరేషన్ ఒకే, డేట్స్ ఓకే అని చెప్పాను. కమిట్మెంట్ కావాలని అడిగారు. కమిట్మెంట్ అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్టులను కమిట్మెంట్ అడగటం, వారిని శారీరకంగా వాడుకోవడం గురించి విన్నాను. కానీ మగాళ్లను కూడా ఇలా అడుగుతున్నారని తెలిసి షాకయ్యాను. దీంతో ఆ సినిమాను వదిలేసుకున్నాను. దీన్ని బయటపెడితే నీ సంగతి చెబుతాం అంటూ బెదిరించారు కూడా. ఆ విషయం జరిగి చాలా కాలం అయింది కాబట్టి ఇపుడు బయట పెడుతున్నాను అని ఫని తెలిపారు.