Mahesh Babu As Arjun Reddy, Is Mahesh Lookout For Innovative Stories

2018-02-05 347

According to reports. Prince of Tollywood is on the lookout for young directors with innovative stories

ఎంతో ఇష్టపడి చేసిన బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు ప్రిన్స్ మహేశ్‌బాబుకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఎంతో మంది అభిమానులకు నిరుత్సాహాన్ని కలిగించాయి. అయితే శ్రీమంతుడు ఆడియో కార్యక్రమంలో ఫ్యాన్స్ ఇక నిరాశ పరచను. ఒకవేళ నిరాశ పరిచితే నన్ను క్షమించాలి అని ప్రిన్స్ కోరిన సంగతి తెలిసిందే. తాను చెప్పిన ప్రకారమే ప్రిన్స్ మహేష్ తన కెరీర్‌ను సరైన రీతిలోమలుచుకొనేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నది. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్‌బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రానున్న వేసవిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నారు. కైరా అద్వానీ, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు.
భరత్ అను నేను సినిమా తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లితో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్నది. ఇలా వరుస చిత్రాల్లో నటిస్తూనే కొత్త దర్శకులతో సినిమా చేయడానికి సిద్ధపడుతున్నారు.