Under-19 World Cup : India Lift record fourth U-19 World Cup title

2018-02-03 7,419

India's previous title came in Australia six years ago when the Unmukt Chand-led team beat the hosts in the final. The Virat Kohli-led side was victorious in 2008 and Mohammed Kaif was captain when India triumphed way back in 2000.

నాలుగోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత యువ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గ‌తంలో ఎవ‌రికీ సాధ్యం కాని రీతిలో అండ‌ర్-19 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను నాలుగోసారి గెలిచి పృథ్వీ షా నేతృత్వంలోని యువ భారత జట్టు చరిత్ర సృష్టించింది. మౌంట్ మాంగన్యూ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 217 ప‌రుగుల విజయ ల‌క్ష్యాన్ని కేవ‌లం 38.5 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి భారత్ చేధించింది. టోర్నీలో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా పైనల్లో కూడా అదే జోరుని కొనసాగించింది. బౌలింగ్‌, ఫీల్డింగ్‌, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసి నాలుగోసారి విశ్వ విజేతగా నిలిచింది.
ఓపెన‌ర్ మ‌న్‌జోత్ క‌ల్రా (101 నాటౌట్‌) సెంచ‌రీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఇదే ఆస్ట్రేలియాపై వంద ప‌రుగుల‌తో గెలిచిన టీమిండియా ఫైన‌ల్లో కూడా ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో ఆసీస్‌తో మొదలుకుని ప‌పువా న్యూ గినియా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ ఆ తర్వాత మళ్లీ ఆస్ట్రేలియాపై గెలిచింది. రాహుల్ ద్ర‌విడ్ కోచింగ్‌లో పృథ్వి షా సేన‌ ఓ ఛాంపియన్ జట్టులా ఆడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల దెబ్బకు 47.2 ఓవ‌ర్ల‌లో 216 ప‌రుగుల‌కే ఆలౌటైంది. భారత బౌలర్లలో అనుకుల్ రాయ్, కమలేష్ నాగర్ కోటి, శివ సింగ్, ఇషాన్ పోరేల్ తలో రెండు వికెట్లు తీసుకోగా, శివమ్ మావి ఒక వికెట్ తీశాడు.