Many shops were gutted in a 'major' fire which broke at 10.45 p.m. on Friday along the East Tower side of the Sri Meenakshi Sundareswarar Temple.
తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధ మధురై మీనాక్షి ఆలయంలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయంలోని వేయికాళ్ల మండపం వద్ద చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో దాదాపు 50కి పైగా చిన్న దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.
సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 10 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలార్పివేశాయి. కలెక్టర్ వీరరాఘవరావు మీనాక్షి దేవాలయానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఒక షాపులో నెలకొన్న అగ్ని ప్రమాదం ఇతర షాపులకు వ్యాప్తిచెందడంతో భారీ ఆస్తి నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. కాగా, అగ్ని ప్రమదానికి కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.