Super Blue Blood Moon : సూపర్ మూన్, బ్లూ మూన్, బ్లడ్ మూన్ ఒక్కసారే !

2018-01-31 210

A blue moon refers to the second full moon in a month. Typically, a blue moon happens every two years and eight months. This full moon is also the third in a series of “supermoons,” which happen when the moon is closest to Earth in its orbit. the last time a supermoon, blue moon and total lunar eclipse all together were visible from the eastern United States was on May 31, 1844.


ఖగోళ పరంగా సూర్యుడు,భూమి,చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరిగుతుంటాడు.
సూర్య,చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే సూర్యుడు,భూమి,చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్దగాని,కేతువు వద్దగాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.పూర్తి చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంఫూర్ణ చంద్రగ్రహణమనీ,కొంత భాగమే కనిపించకపోయేదాన్ని పాక్షిక చంద్రగ్రహణము అని అంటారు.ఈ నెల 31 తేది బుధవారం రోజున పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటకరాశిలో సాయంత్రం 5:18 మొదలుకొని 8:41 వరకు కర్కాటక,సింహ లగ్నాలలో రాహూగస్త సంపూర్ణ చంద్ర గ్రహణము సంభవించనున్నది. ఇది భారత కాలమానం ప్రకారం సాయత్రం ప్రారంభం అవుతుంది.
ఇక ఈ నెల 31 తేది న సంభవించే చంద్ర గ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక సూపర్ మూన్, చంద్ర గ్రహణం మరియు ఒక బ్లూ మూన్ ఒకేసారి రావటం గత 150 సంవత్సరాలలో సంభవించలేదు!
ఫుల్ మూన్ కంటే 14% నుండి 30% ప్రకాశవంతంగా కనిపించే మూన్ ని సూపర్ మూన్ అంటారు. ఇక ఒకే నెలలో రెండు సూపర్ మూన్ లు సంబవిస్తే గనుక దాన్నిబ్లూ మూన్ అంటారు. ఇక ఇప్పుడు సూపర్ మూన్, చంద్ర గ్రహణం మరియు ఒక బ్లూ మూన్ ఒకేసారి రావడంతో ఈ చంద్ర గ్రహణానికి ప్రత్యేకత ఏర్పడింది.