ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీలో ‘సాహో’ హీరోయిన్?

2018-01-30 1,268

Reports are doing rounds that the makers of Jr NTR-Trivikram film have finalised the lead actress for the film after having considered numerous options. Buzz is that the makers are keen on casting Shraddha as the female lead in Jr NTR’s upcoming film with Trivikram.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం ఫిల్మ్ నగర్లో ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ మూవీ ‘సాహో' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోన్న బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ ఇప్పుడు ఎన్టీఆర్‌కు జోడీగా ఎంపికైనట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.
దర్శకుడు త్రివిక్రమ్‌ ఇటీవలే శ్రద్ధా కపూర్‌ను కలిశారని, ఆమెకు కథ వినిపించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఒప్పుకుందా? లేదా? ఆమెను ఫైనల్ చేశారా? లేదా? అనే విషయంలో చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
ప్రముఖ రచయిత మధుబాబు రచించిన ఓ డిటెక్టివ్‌ నవల ఆధారంగా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని, యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. మున్ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త్రివిక్రమ్ ముందే ఈ నవల రైట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
స్టార్ రైటర్‌గా ఓ వెలుగు వెలిగిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మారిన తర్వాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే మొదటి నుండి ఆయన కెరీర్ అప్ అండ్ డౌన్స్ తో సాగుతోంది. ఆయన తాజా మూవీ ‘అజ్ఞాతవాసి' బాక్సాఫీసు వద్ద దారుణమైన పరాజయం పాలైంది.