నదిలో పడిన బస్సు, ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్

2018-01-30 1,250

At least 36 people were lost life when a bus carrying 50 passengers went off a bridge and drowned into a drain in Murshidabad on early morning Monday.

పశ్చిమ బెంగాల్‌లోని దౌల్తాబాద్‌ సమీపంలో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లడంతో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సులో 56 మంది ప్రయాణిస్తుండగా.. ఇప్పటివరకూ కేవలం ఏడుగురి ఆచూకీ మాత్రమే లభ్యమైంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు నదియా జిల్లాలోని కరీంపూర్‌ నుంచి ముషీరాబాద్‌లోని బెర్హంపూర్‌కు బయల్దేరింది. అజయ్‌ నదిపై నిర్మించిన బాల్లీ బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. దీంతో ప్రయాణీకులను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. పోలీసులు, రెస్క్యూ టీంలకు సమాచారం అందించారు.
ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు సీఎం మమతా బెనర్జీ రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. కాగా, డ్రైవర్ బస్సు నడుపుతూ ఫోన్ మాట్లాతుండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.