Few pictures that were taken on the sets of Thalapathy 62 have found their way to the internet. In these stills, Vijay is sporting a stubble as well as a new hairstyle.
తమిళనాట స్టార్ హీరో విజయ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పెద్ద పండుగే. మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడాయన దర్శకుడు మురుగాదాస్ తో సినిమా చేయబోతున్నారు. విజయ్ నటిస్తున్న 62వ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా, ఈ సినిమాలో విజయ్ లుక్ కు సంబంధించి తాజాగా ఓ లీక్ రావడం గమనార్హం.
మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ చేయబోతున్న సినిమాలో.. ఆయన లుక్ ఇలాగే ఉండబోతుందంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో హల్ చల్ చేస్తోంది. ఇందులో విజయ్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. లైట్ గడ్డంతో, టీషర్ట్ ధరించి కనిపిస్తున్న ఈ ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
గతేడాది డిసెంబర్ లోనూ విజయ్ ఫోటోషూట్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. మురుగదాస్ తో సినిమా నేపథ్యంలో ఈ ఫోటోషూట్ జరపగా.. అవికాస్త సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. బ్లేజర్ ధరించి, చేతిలో పిస్టల్ పట్టుకుని ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజాగా లీకైన ఫోటో కూడా షూటింగ్ సెట్స్ నుంచే లీకైనట్లుగా భావిస్తున్నారు. ఓ పాట చిత్రీకరణలో భాగంగా చేసిన ఫోటోషూట్ నుంచే ఈ ఫోటో లీకైందన్న ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా కొత్త గెటప్స్‌లో కనిపించడానికి ఆసక్తి కనబరుస్తున్న విజయ్.. తాజాగా లీకైన ఫోటోలో కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్నారు.