Budget 2018 : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

2018-01-29 91

Prime Minister Narendra Modi has said the government is taking the suggestions of the opposition "sincerely", Parliamentary affairs minister Ananth Kumar told the media after an all-party meeting ahead of the budget session today.

పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఎన్‌డిఏ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదే. ఫిబ్రవరి 1వ, తేదిన పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. విపక్షాల నుండి ఎన్ డి ఏ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని విపక్షాలు ఎన్‌డిఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్, వెనుకబడిన కులాల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడం, ట్రిపుల్ తలాక్ బిల్లులు ఈ సెషన్‌లో ప్రభుత్వం పెట్టనుంది. విపక్షాల నుండి ప్రభుత్వం సలహలను స్వీకరించేందుకు సిద్దంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి అనంతకుమార్ ఆదివారం నాడు జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత ప్రకటించారు. ఈ మేరకు మోడీ సానుకూలంగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మరోవైపు విపక్షాలు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు సిద్దమౌతున్నాయి. దేశ వ్యాప్తంగా మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, రాజ్యాంగ వ్యవస్థలపై చోటు చేసుకొంటున్న దాడుల గురించి ప్రస్తావించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది కేంద్రప్రభుత్వం ఉద్యోగాల కల్పనతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహ వ్యాపారులకు అవకాశాలను కల్పించే దిశగా చర్యలను చేపట్టనుంది.ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో పెండింగ్ లో ఉంది. రాజ్యసభలో ఈ బిల్లు పాస్ కావాల్సి ఉంది. రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ బడ్జెట్ సమావేశాలను సోమవారం నాడు ప్రారంభించనున్నారు.

Videos similaires