IPL Auctions 2018 Complete player list of sold and unsold players with price and money and teams which have bought them.
ds : శనివారం జరిగిన తొలిరోజు వేలంలో ఆటగాళ్లు కొందరు అటూ, ఇటూ మారారు. టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న ఆప్ఘనిస్థాన్ యువ క్రికెటర్ రషీద్ ఖాన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 9 కోట్లు ఖర్చు చేసింది. తొలిరోజు వేలంలో బెంగళూరు రైట్ టు మ్యాచ్ కార్డులను ఉపయోగించనేలేదు. తొలి రోజు వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధికంగా 14 మంది ఆటగాళ్లను ఎంచుకుంది. అందులో ఇద్దరిని రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా తీసుకుంది.
* ముంబై కేవలం ఆరుగురిని మాత్రమే కొనుగోలు చేసింది. అందులో రెండు రైట్ టు మ్యాచ్ కార్డులను ఉపయోగించింది.
* చెన్నై జట్టూ శనివారం ఎనిమిది మంది ఎంచుకోగా.. అందరూ 30 ఏళ్లు పైబడిన వాళ్లే కావడం గమనార్హం.
* వేలంలో అందుబాటులో ఉన్న 16 రైట్ టు మ్యాచ్ కార్డులను అన్ని జట్లూ తొలిరోజే ఉపయోగించాయి.
* తొలి రోజు 109 మంది ఆటగాళ్లు వేలానికి వచ్చారు. 78 మంది అమ్ముడయ్యారు.
సన్ రైజర్స్ హైదరాబాద్:
* మనీష్ పాండే (రూ. 11.0 కోట్లు),* రషీద్ ఖాన్ (9.0),* శిఖర్ ధావన్ (5.2),* వృద్ధిమాన్ సాహా (5.0),
* సిద్ధార్థ్ కౌల్ (3.8),* దీపక్ హుడా (3.6),* సయ్యద్ ఖలీల్ అహ్మద్ (3.0),
* కేన్ విలియమ్సన్ (3.0),* కార్లోస్ బ్రాత్‌వైట్ (2.0),* షకిబ్ అల్ హసన్ (2.0),* యూసుఫ్ పఠాన్ (1.9),* బాసిల్ థంపి (0.95),* నటరాజన్ (0.40),* రికీ భుయీ (0.20)