షకీలా మళ్లీ విజృంభణ... రియల్ స్టోరీ !

2018-01-28 1

Shakeela's 250th movie Sheelavati first look launched on the eve of Republic day. Shakeela, Director Sairam Dasari, Producers Ganesh and Veerababu are attended the first look launch event. Ganesh said that.. Sheelavati movie made on the real incident happend in Kerala

షకీలా 250 వ చిత్రం 'శీలవతి' ఫస్ట్‌లుక్‌ విడుదల అయింది. జీ స్టూడియోస్‌ పతాకంపై మలయాళం సూపర్‌ స్టార్‌ షకీలా హీరోయిన్‌గా, సాయిరాం దాసరి దర్శకత్వంలో రాఘవ ఎమ్‌. గణేష్‌, వీరు బాసింశెట్టిలు సంయుక్తంగా నిర్మించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'శీలవతి'. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. రిపబ్లిక్‌ డే సందర్భంగా హైదరాబాద్‌లో శీలవతి మూవీ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయిరాం దాసరి మాట్లాడుతూ.. ''మా హీరోయిన్‌ షకీలాకు ఇది 250వ చిత్రం. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌ అని అన్నారు.
మా నిర్మాతలు గణేష్‌, వీరబాబు గారు ఇచ్చిన ప్రోత్సాహంతో అనుకున్న దానికంటే చాలా బాగా తెరకెక్కించగలిగాము. సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. ప్రజ్వల్‌ క్రిష్‌ అద్భుతమైన నేపథ్య సంగతాన్ని అందించారు. తప్పకుండా ఈ చిత్రం ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తుంది అని సాయిరాం దాసరి అన్నారు.
నిర్మాతలలో ఒకరైన రాఘవ ఎమ్‌. గణేష్‌ మాట్లాడుతూ.. ''ఊహించిన దానికంటే ఈ చిత్రం బాగా వచ్చింది. ఈ రోజు నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటుంది. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం.'' అన్నారు.