'ఇంటిలిజెంట్‌' టీజర్‌ : ఇంటిలిజెంట్‌ సినిమా ఎప్పుడు చూద్దామా అని ఉంది

2018-01-28 762

Mega Supreme Hero Sai Dharam Tej acted in an interesting movie in the direction of VV Vinayak. The film is titled as Intelligent. The makers are happy that Balakrishna released the teaser of the film a while ago. It looks like there is an interesting concept in the film’s teaser.

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న చిత్రం 'ఇంటిలిజెంట్‌'. ఈ చిత్రం టీజర్‌ను నటసింహ నందమూరి బాలకృష్ణ శనివారం విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో సాయిధరమ్‌ తేజ్‌, దర్శకుడు వి.వి.వినాయక్‌, నిర్మాత సి.కళ్యాణ్‌, రచయిత శివ ఆకుల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ''సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో మా సి.కళ్యాణ్‌గారు వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న నాలుగో సినిమా ఇది. వినాయక్‌ కాంబినేషన్‌లో ఇంతకుముందు 'చెన్నకేశవరెడ్డి' సినిమా చేశాం. మన కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు అని అడుగుతుంటాను అని ఆయనను అడుగుతాను అని బాలకృష్ణ చెప్పారు
సినిమా విషయంలో వీవీ వినాయక్ ఇన్‌వాల్వ్‌మెంట్‌, కలుపుగోలుతనం, ఆర్టిస్టు నుంచి సరైన పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడం ఆయనకు తెలుసు. ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు వి.వి.వినాయక్‌. ఆయన దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ నుంచి మరో నటవారసుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా రూపొందిన చిత్రం 'ఇంటిలిజెంట్‌'. ఈ సినిమా టీజర్‌ని నా చేతుల మీదుగా రిలీజ్‌ చేయడం చాలా సంతోషంగా వుంది అని బాలయ్య అన్నారు.
ఎందుకంటే సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నా సొంత బేనర్‌తో సమానం. కళ్యాణ్‌గారు పెద్ద హీరోలతో, చిన్న హీరోలతో ఇంకా సినిమా చేయాలి. ఈ సినిమా టీజర్‌ చాలా బాగుంది. మిస్టీరియస్‌గా వుంది అని బాలకృష్ణ పేర్కొన్నారు.టీజర్‌ చూసిన తర్వాత సినిమా ఎప్పుడు చూడాలా అనిపిస్తుంది. టైటిల్‌ కూడా చాలా బాగుంది. మెగా అభిమానులకు, ఇది నా బేనర్‌ కాబట్టి నా అభిమానులకు, ముఖ్యంగా యూత్‌కి ఈ సినిమా కనెక్ట్‌ అవుతుంది. సినిమా ఘనవిజయం సాధిస్తుంది అని బాలయ్య అన్నారు.

Videos similaires