According to latest reports, Prabhas 20 movie director has approached Sara Ali Khan, the daughter of Bollywood hero Saif Ali Khan. Sara Ali Khan has already become popular even before the release of her first film, Kedarnath, and looks like the star kid will soon bag another project.
బాహుబలి' తర్వాత ఇండియన్ సినీ రంగంలో హీరో ప్రభాస్ అతిపెద్ద స్టార్లలో ఒకడిగా అవతరించాడు. ఒకప్పుడు ప్రభాస్ అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే... కానీ ఇపుడు ఇండియా వైడ్ ఈ స్టార్‌కు అభిమానులు ఏర్పడ్డారు. ఆయనకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ వచ్చిన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం 'సాహో' ప్రాజెక్టులో నటిస్తున్న ప్రభాస్ ఈ చిత్రం తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇది ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రం కాబోతోంది. ప్రభాస్ 20' సినిమాకు సంబంధించి తెర వెనక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ నెలలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో హీరోయిన్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామలనే తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఇటీవలే ‘కేధార్నాథ్' సినిమా ద్వారా హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టారు. తాజాగా ఈ బ్యూటీని దర్శకుడు రాధాకృష్ణ సంప్రదించినట్లు సమాచారం. బాహుబలి' సినిమాతో పెద్ద స్టార్ గా అవతరించిన ప్రభాస్‌తో సినిమా అవకాశం అనగానే సారా అలీ ఖాన్ ఆసక్తిగా దర్శకుడు చెప్పిన స్క్రిప్టు విన్నట్లు సమాచారం. ఈ సినిమాలో చేయడానికి ఆమె ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండే సారా అలీ ఖాన్ ఇపుడు ఆకట్టుకునే శరీరాకృతితో ఎంతో అందంగా తయారైంది. హైట్ పరంగా, ఫిజిక్ పరంగా ఆమె ప్రభాస్‌కు పర్ఫెక్ట్ జోడీగా ఉంటుందని అంటున్నారు. సారా వయసు ప్రస్తుతం 24 సంవత్సరాలు.
ప్రస్తుతం సారా అలీ ఖాన్ కెరీర్ ఆరంభంలో ఉంది కాబట్టి..... అమృత సింగ్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకుంటోందట. ప్రస్తుతానికైనా ప్రభాస్ సినిమా నిర్ణయం పెండింగులో ఉందని సమాచారం. త్వరలో ఈ విషయమై ఓ క్లారిటీ రానుంది.