టచ్ చేసి చూడు ప్రీ రిలీజ్ ఈవెంట్

2018-01-28 205

Touch Chesi Chudu Pre Release Event held in Hyderabad. Touch Chesi Chudu 2018 Telugu Movie ft. Ravi Teja, Raashi Khanna and Seerat Kapoor. Music by JAM8. Directed by Vikram Sirikonda. Produced by Nallamalapu Srinivas (Bujji) and Vallabhaneni Vamsi under Lakshmi Narasimha Productions (LNP) banner.

రవితేజ హీరోగా, రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లుగా నటించిన 'టచ్ చేసి చూడు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కాబోతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా నిర్వహించారు. విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించారు.
ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రవితేజ మాట్లాడుతూ...‘ఈ వేడుక సందర్భంగా నేను ముందుగా థాంక్స్ చెప్పాల్సింది ``జామ్ 8''కు.... వారిచ్చిన సౌండ్, మ్యూజిక్ సూపర్ గా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకు చాలా మంది టాప్ టెక్నీషియన్స్ పని చేశారు. రాశీ ఖన్నా, సీర‌త్ క‌పూర్ ఎంత అందంగా ఉంటారో, అంతే అంద‌మైన న‌డ‌వ‌డిక ఉన్నవారు. ఈ సినిమా పెద్ద స‌క్సెస్‌ణు సాధించి నా నిర్మాత‌లు బుజ్జి, వ‌ల్ల‌భ‌నేనిల‌కు బాగా డ‌బ్బులు రావాలి. విక్ర‌మ్‌ మంచి క్లారిటీ ఉన్న డైరెక్ట‌ర్‌. సినిమాను అద్భుతంగా తీశాడు. వ‌క్కంతం చాలా మంచి క‌థ‌ను అందించాడు. ఈ సినిమాతో మ‌న‌కు మంచి డైరెక్ట‌ర్ రాబోతున్నాడు. ఈ సినిమా హిట్ అయితే, ఆ క్రెడిట్ అంతా విక్ర‌మ్‌దే'' అన్నారు.
ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సిరికొండ మాట్లాడుతూ ``వినాయ‌క్‌గారు నాకు ఫిల్మ్ గురు. చాలా మంచి విష‌యాల‌ను ఆయ‌న్నుండి నేర్చుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నల్ల‌మ‌లుపు బుజ్జి, వ‌ల్ల‌భ‌నేని వంశీగారికి థాంక్స్‌. వ‌క్కంతం వంశీ అద్భుతమైన క‌థ‌ను అందించారు. ఎన‌ర్జీని ఆయ‌న త‌న నుండి మ‌రొక‌రికి కూడా ఇచ్చే వ్య‌క్తి ర‌వితేజ‌గారు. మ‌నిషి లైఫ్‌లో అద్భుతాలు జ‌రుగుతుంటాయి. నా లైఫ్‌లో జ‌రిగిన అద్భుతం మాస్ మ‌హారాజ్‌. అలాంటి హీరోతో నేను డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం కావ‌డం నా అదృష్టం. ఈ టైటిల్‌లో ఎలాంటి ప‌వ‌ర్ ఉంటుందో, సినిమాలో కూడా అంతే ప‌వ‌ర్ ఉంటుంది. మీరు డిస‌ప్పాయింట్ కారు. మంచి మెసేజ్ కూడా ఉంది.'' అని దర్శకుడు విక్రమ్ సిరికొండ తెలిపారు.