here are 16 top players awarded marquee status and a base price of INR 2 crore with notable among them being Stokes, Ashwin, Shikhar Dhawan, Mitchell Starc, Chris Gayle, and Dwayne Bravo to name a few. But Yuvraj Singh, Gambhir @ 2 cr only
ఐపీఎల్ 11 గురించి పూర్తి వివరాలు: 1122: ఐపీఎల్‌లో ఆడేందుకు రిజిష్టర్ చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య, 578: రిజిష్ట్రేషన్ అయిన సభ్యుల్లో నుంచి బీసీసీఐ 578కి కుదించింది. 360: ఐపీఎల్ సీజన్‌కు భారత్ నుంచి పాల్గొనబోతున్న ఆటగాళ్ల సంఖ్య, 218: మొత్తం విదేశీ ఆటగాళ్ల సంఖ్య, 244: క్యాప్‌డ్ ప్లేయర్లు (182 మంది విదేశీలు, 62 మంది భారతీయులు), 332: అన్ క్యాప్‌డ్ ప్లేయర్లు (298 మంది భారతీయులు, 34 మంది విదేశీయులు)
క్రికెట్ అభిమానుల నుంచి ప్లేయర్ల వరకు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తోన్న ఐపీఎల్‌లో మొదటి దశ ఆరంభమైంది. వెయ్యికి పైగా క్రికెటర్లు ఐపీఎల్‌లో పాల్గొనేందుకు పోటీపడినా బీసీసీఐ కేవలం 578మందిని మాత్రమే వేలానికి ఆమోదించింది. పైగా వీరందరిలో గరిష్ఠ ధర 2 కోట్లుగా పేర్కొంది. ఈ వేలంలో రెండు జట్లు మాత్రం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టనున్నాయి. అంటే దాదాపు 67.5కోట్లకు పైగా ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం. ఆ రెండు జట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్.
గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండ్ ఆటగాడైన బెన్ స్టోక్స్ అత్యధిక ధర పలికాడు. 14.5కోట్ల రూపాయలు పలికిన అతని ధర రైజింగ్ పూనె సూపర్ జయంట్ జట్టు చెల్లించింది. ఈ సంవత్సరం రైజింగ్ పూనె, గుజరాత్ లయన్స్ పోటీలో ఆడటం లేదు. వీటికి బదులుగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 2016, 2017 రెండు సంవత్సరాల విరామం తర్వాత పిచ్‌లోకి దూకనున్నాయి.