Trade expert Ramesh Bala posted stating that there has been a huge drop in the collections of 'Jai Simha' and Agnyaathavaasi. Pawan Kalyan has made it clear that he is not going to return his remuneration but the producers are willing to give back 15cr rupees to the buyers.
టాలీవుడ్‌కు సంక్రాంతి పండుగ కొంత నిరాశను, మరికొంత సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఏడాది పండుగ రేసులో విడుదలైన చిత్రాలు ప్రేక్షకులకు, డిస్టిబ్యూటర్లకు నిరాశనే మిగిల్చాయి. అయితే జై సింహా కలెక్షన్లు పుంజుకోవడం కొంత ఉపశమనంగా మారింది. అయితే అజ్ఞాతవాసి, జై సింహా డిస్టిబ్యూటర్ల గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. అజ్ఞాతవాసి చిత్రం నకు సుమారు రూ.80 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా. దీంతో ప్రాంతాల వారీగా డిస్టిబ్యూటర్లకు ఊహించిన నష్టాలు ఎదురవ్వడానికి అవకాశం ఉంది. కానీ పంపిణీదారులను ఆదుకొనేందుకు చిత్ర నిర్మాత, దర్శకులు రంగంలోకి దిగినట్టు సమాచారం.
వాస్తవానికి డబ్బు తిరిగి చెల్లించే ఒప్పందం అజ్ఞాతవాసి డిస్టిబ్యూటర్లకు, నిర్మాతకు మధ్య లేదు. కానీ మానవీయ కోణంలో పంపిణీదారులను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు నిర్మాత రాధాకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నట్టు ఫిలింనగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది.
అజ్ఞాతవాసి హక్కులను భారీ మొత్తాలకు చేజిక్కించుకొని నష్టపోయిన డిస్టిబ్యూటర్లకు సొమ్ము తిరిగి ఇచ్చేది లేదని ఇప్పటికే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. లాభాలు వచ్చినప్పుడు డిస్టిబ్యూటర్లు ఏమైనా తిరిగి ఇచ్చారా అనే పవన్ అన్నట్టు సినీవర్గాల్లో చర్చ జరుగుతున్నది.