Karnataka Bandh in Hubli, Dharwad, Belgaum : హుబ్బళి లో సంపూర్ణ బంద్

2018-01-25 37

Various pro-Kannada organisations have called for ‘Karnataka Bandh’ today on January 25, demanding central government’s intervention into the Mahadayi water sharing dispute. The 12-hour statewide shutdown is likely to affect normal life in cities and towns across the state.


కర్ణాటక బంద్ : హుబ్బళి లో సంపూర్ణ బంద్
మహాదాయి నదీ నీటి పంపిణి విషయంలో పొరుగు రాష్ట్రాలు అయిన గోవాలోని బీజేపీ- కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాదాయి నదీ నీటిని తీసుకు వచ్చి హుబ్బళి-దారవాడ జంట నగరాలతో పాటు చుట్టుపక్కల ప్రజలకు తాగు నీరు అందించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి . కన్నడ చళువళి వాటల్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ నేతృత్వంలో జరుగుతున్న బంద్ కు 2,000 కన్నడ సంఘ, సంస్థలు మద్దతు ప్రకటించాయి. ఉత్తర కర్ణాటకలోని ఐదు జిల్లాలో సంపూర్ణంగా బంద్ జరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక మొత్తం ఆసుపత్రులు, క్లీనిక్ లు నిర్వహించడానికి బంద్ నిర్వహకులు అనుమతి ఇచ్చారు. అంబులెన్స్ లు ఎక్కడా అడ్డుకోరాదని, పాలు, పూల దుకాణాలు తీసినా వారిని ఏమీ మాట్లాడకూడదని బంద్ నిర్వహకులు సూచించారు.

Videos similaires