How Karnataka Bandh Affects Normal Life in Bangalore. Watch Video
మహాదాయి నదీ నీటి పంపిణి విషయంలో గోవా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ గురువారం (జనవరి 25) కర్ణాటక బంద్ కు కన్నడ సంఘాలు పిలుపునివ్వడంతో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బెంగళూరు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక బంద్ సందర్బంగా బెంగళూరు నగరంలో భారీ ర్యాలీలు, ధర్నాలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు పోలీసులు, సాయుధ బలగాలను రంగంలోకి దింపుతున్నారు. గతంలో బంద్ సందర్బంగా జరిగిన సంఘటనలు గుర్తు పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు నిఘా వేశారు. గోవా, మహారాష్ట్ర సరిహద్దు నుంచి వచ్చే వాహనాలను చెక్ పోస్టుల దగ్గరే నిలిపివేయాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మహాదాయి నదీ నీటి పంపిణి విషయంలో పొరుగు రాష్ట్రాలు అయిన గోవాలోని బీజేపీ- కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాదాయి నదీ నీటిని తీసుకు వచ్చి హుబ్బళి-దారవాడ జంట నగరాలతో పాటు చుట్టుపక్కల ప్రజలకు తాగు నీరు అందించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి