Actress Namitha recenltly got married with his love interest veera. Both were attended for a Interview for youtube Channel. On that show, she revealed about her personla life. Namitha said Bigg Boss was a drama show. she accuses that her voice manipulated.
జాతీయ స్థాయిలో హిందీ భాషలో బిగ్‌బాస్ రియాల్టి షో ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు ఎన్టీఆర్, తమిళంలో కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరించడంతో ఈ రియాల్టీ షోకు దక్షిణాదిలో మంచి క్రేజ్ వచ్చింది. అయితే బిగ్‌బాస్ వ్యవహారమంతో ఓ డ్రామా అంటూ నమిత వ్యాఖ్యలు చేయడం ఆ షోలో నైతికత ఎంత అనే విషయం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..
దక్షిణాది చిత్ర పరిశ్రమలో హాట్ హీరోయిన్‌గా పేరొందిన నమిత తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొనడం అప్పట్లో ఓ సంచలనంగా మారింది. ఆ తర్వాత అనేక వివాదాల నడుమ నమిత ఆ షో నుంచి బయటకు రావడం మరింత క్రేజ్ పెంచింది.
అయితే బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన స్నేహితుడు వీరాను నమిత పెళ్లి చేసుకొన్నది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో నమిత మాట్లాడుతూ.. బిగ్‌బాస్ రియాలిటీ షో ఓ డ్రామా. ఆ కార్యక్రమానికి క్రేజ్ పెంచుతూ వివాదాలు ప్లాన్ చేస్తుంటారు.
బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొన్న సెలబ్రిటీలు, నిర్వాహకులకు నిజాయితీగా వ్యవహరించరు. నేను ఏ విషయాన్నైనా ముఖం మీదే చెప్పేయటం వల్ల నాకు సమస్యలు ఎదురయ్యాయి.
సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే మనస్తత్వం నాది. అలాంటిది నేను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి తప్పుడు రీతిలో నిర్వాహకులు ప్రచారం చేశారు. అలా నన్ను క్యారెక్టర్‌ను డామేజ్ చేయడానికి ప్రయత్నించారు అని నమిత వాపోయారు.