India vs South Africa 3rd Test Preview

2018-01-22 32

Cape Town and Centurion were different wickets, but on both of them, sometimes bowlers become impatient and try a lot of things. Indian bowlers though showed good patience and stuck to their plans.

మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను మరో టెస్టు మిగిలుండగానే 0-2తో కోహ్లీసేన సిరిస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు టెస్టుల్లో టీమిండియా ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. విదేశీ గడ్డపై అద్భుతమైన రికార్డు ఉన్న టెస్టు కెప్టెన్ అజ్యింకె రహానేను మొదటి రెండు టెస్టులకు దూరంగా పెట్టడం.... సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఫామ్‌లో ఉన్న భువీ స్థానంలో ఇషాంత్ చోటు కల్పించడం ఇలాంటివి ప్రభావం చూపాయి.
టీమిండియా టెస్టు సిరిస్‌ను కోల్పోయిన నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కోహ్లీకి అసలు బెస్ట్-11 ఎంచుకోవడం తెలియదని కొందరు అంటే, మరికొందరు తుది జట్టుని ఎంపిక చేసిన సెలక్టర్లపై తీవ్ర విమర్శలు చేశారు. రహానే స్థానంలో రోహిత్ శర్మను ఆడించడం కోహ్లీ తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయమని అన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు కోహ్లీసేన వరుసగా తొమ్మిది టెస్టు సిరిస్ విజయాలను సాధించి ప్రపంచ రికార్డుని సైతం నెలకొల్పింది. అదే ఊపులో సఫారీ గడ్డపై కోహ్లీసేన విజృంభిస్తుందని, వరుసగా పదో టెస్టు సిరిస్ విజయాన్ని సొంతం చేసుకుని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు నెలకొల్పిన రికార్డుని అధిగమిస్తుందని అంతా భావించారు.