A twist of fate is right around the corner for Sanjay Leela Bhansali's Padmaavat and this time it's come from a Rajput group of women named Jauhar Smriti Sansthan, who have given out official memorandums addressed to the Prime Minister, the President, Rajasthan Governor and the Chief Minister asking them to ban the film and if failed to do so, will end their lives for 'Swabhimaan' (self respect) the same way Rani Padmavati, along with 16,000 other Rajput women did in 1303.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపిక పదుకోన్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'పద్మావత్' సినిమా విడుదల నిలిపి వేసే వరకు రాజ్ పుత్ గ్రూఫులు విశ్రమించేట్లు కనిపించడం లేదు. తాజాగా రాజ్ పుత్ ఉమెన్ గ్రూఫు ఈ చిత్రానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు.
‘పద్మావత్' చిత్రం విడుదలపై నిషేదం విధించాలని డిమాండ్ చేస్తూ రాజస్థాన్‌కు చెందిన ‘జౌహరి స్మృతి సంస్థాన్' అనే మహిళా గ్రూపు ఆందోళనకు దిగింది. దాదాపు 200 మంది మహిళలు ఈ సినిమాకు వ్యతిరేకంగా రోడ్డుమీదకు వచ్చి ర్యాలీ నిర్వహించారు.
‘పద్మావత్' సినిమాపై నిషేదం విధించని పక్షంలో తామంతా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. 1303 సంవత్సరంలో రాణి పద్మావతి 16000 మంది రాజ్ పుత్ మహిళలతో కలిసి ‘స్వాభిమాన్' ఆత్మాహుతి చేసుకున్న విధంగా తామంతా ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించారు.