కాంగ్రెసుకు గుబులు, తెలంగాణలో పవన్ పక్కా ప్లాన్‌ !

2018-01-22 1,393

Jana Sena founder Pawan Kalyan said he would visit Hanuman Temple in Kondagattu near Karimnagar on Monday and announce his political programme. According to political analysts - Jana Sena chief Pawan Kalyan Telangana operation may help KCR.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. పవన్ పర్యటన తెలుపు రంగు ఫోర్డ్ కారులో సాగనుంది. పవన్ తెలంగాణలో యాత్రను వ్యూహాత్మకంగా ప్రారంభించారని తెలుస్తోంది. తెలంగాణ పర్యటనలో పవన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. గతంలో తెలంగాణలో ఆయన తన అభిమానులు, జనసేన నాయకులతో సమావేశాలు నిర్వహించారు. గత ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణలో రాజకీయపరమైన పర్యటన ఇది.
రెండు నెలల కిందటే కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాలో అభిమానులు, పార్టీకార్యకర్తలతో సమావేశం నిర్వహించి.. ఇప్పుడు పక్కాగా పర్యటన ప్లాన్ చేసుకున్నారని చెప్పవచ్చు. అంతేకాదు, తనతో కంటే కిందిస్థాయి నుంచి కలుపుకొని వెళ్లేవారికి పవన్ ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. ప్రజల్లో తిరిగి సమస్యలను అధికారులకు వివరించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని, రాజకీయ విమర్శలు చేయరాదని మొదటి నుంచి కార్యకర్తలకు సూచిస్తున్నారు పవన్ కళ్యాణ్. త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థాయి ఇంచార్జిలను ఎంపిక చేయనున్నారు. వారికి హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ తరగతులు ఇప్పించనున్నారు.

Videos similaires