Putting an end to controversy, Janasena official spokes person declared that the rivalry between Mahesh Kathi and fans was ended now.
నాలుగు నెలలుగా ఇదో ఎడతెగని వ్యవహారం. కొంతమందికి విపరీతమైన చికాకు, మరికొంతమందికి విపరీతమైన ఆసక్తి. టీవి పెడితే ఎక్కడ అవే ముఖాల్ని చూడాల్సి వస్తుందోనని కొంతమంది భయపడ్డారు కూడా. ఫైనల్‌గా ఇది అయ్యేది కాదు.. పోయేది కాదు.. అని చాలామంది తీర్మానించేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ కథ సుఖాంతమవడం విశేషం. ఇంతకీ ఏం జరిగిందంటే..
నాలుగు నెలల వివాదానికి కత్తి మహేష్, పవన్‌కల్యాణ్ అభిమానులు ఒక సెల్ఫీతో సుఖాంతం పలికారు. అంతేనా.. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టే పనిచేశారు. ఈ పరిణామం చాలామందికి ఆశ్చర్యంగానే అనిపించింది.
నాలుగు నెలలుగా బద్ద శత్రువుల్లా సాగుతున్న ఆరోపణలు-ప్రత్యారోపణల పర్వానికి శుక్రవారం ఎట్టకేలకు ముగింపు పలికినట్లే కనిపిస్తోంది. ఇందుకోసం కొంతమంది జనసేన నాయకులు రంగంలోకి దిగి మహేష్ కత్తితో ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
మహేష్ కత్తితో చర్చల్లో భాగంగా.. ఆయనపై కోడి గుడ్లతో దాడి చేసినవారితో జనసేన నాయకులు క్షమాపణలు కోరారు. అంతేకాదు, 'సంయమనం పాటించాలి' అని కోరుతూ జనసేన ముందు విడుదల చేసిన లేఖతో మహేష్ కత్తి సంతృప్తి చెందకపోవడంతో..పవన్ అభిమానులు ఎలా ఉండాలో విధివిధానాలతో మరో లేఖను విడుదల చేశారు. దీంతో కత్తి కాస్త మెత్తబడ్డారు.
నా పైన దాడి చేసిన పరిపక్వత లేని, పేద, భ్రమిత పవన్ కళ్యాణ్ అభిమానులను శిక్షించడం నా ఉద్దేశం కాదు. ఆ ఇద్దరిలో ఒక దళితుడు ఉండటం కడు శోచనీయం.