చాలా నీచంగా ఉంటుంది.. నో.. చెప్పిన మహేష్ బాబు !

2018-01-18 4,690

Mahesh Babu Says No To Special Song in Bharat Anu Nenu. he is not said to be interested because the song is actually disturbing the flow of film in second half.

స్టార్ హీరోల సినిమాలంటే భారీ బడ్జెట్, భారీ తారాగణం తప్పనిసరి. ఆయా స్టార్లు పుచ్చుకునే రెమ్యూనరేషన్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల పరంగా వర్కౌట్ అయ్యేలా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తప్పకుండా చేరుస్తారు. ఇలాంటి అంశాల్లో భారీ యాక్షన్ సీన్లు, ఐటం సాంగులను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఒక్కోసారి సినిమా స్టోరీ పరంగా కాస్త వీక్ ఉన్నా.... యాక్షన్ సీన్లు, ఐటం సాంగులు సినిమాను గట్టెక్కిస్తాయని కొందరు నిర్మాతల నమ్మకం. అందుకే సినిమాలో వాటి అవసరం లేకున్నా దర్శకులను బలవంతం చేసి పెట్టిస్తూ ఉంటారు.
టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ‘భరత్ అను నేను' అనే చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో ఐటం సాంగ్ విషయంలో దర్శక నిర్మాతలు, హీరో మహేష్ బాబు మధ్య ఆసక్తికర చర్చసాగినట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు అభిమానులు తమ హీరో సినిమాల్లో తప్పకుండా కోరుకునే అంశాల్లో ఐటం సాంగ్ కూడా ఒకటి.
అయితే ప్రస్తుత మూవీ ‘భరత్‌ అనే నేను' సినిమా విషయంలో మహేష్ బాబు తన అభిప్రాయం మార్చుకున్నారట. ఈ చిత్రంలో ఎలాంటి ఐటం సాంగులు కానీ, ప్ర్యతేక గీతాలు ఉండకూడదని దర్శకుడికి సూచించారట.