In an unfortunate incident Pawan Kalyan fans attacked a person and beaten severly for making negative comments on Agnyaathavasi.
అభిమాన హీరోలు ఇప్పటి యువతరానికి దేవుళ్లు. కాదంటే.. వాళ్లసలు ఒప్పుకోరు. వాళ్ల ఆరాధ్య హీరోకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా.. జన్మలో మళ్లీ ఆ పేరెత్తకుండా చేయగలరు. బయటి వ్యక్తులే కాదు.. ఒకవేళ అభిమానులే వ్యతిరేక కామెంట్స్ చేసినా.. వాళ్లకూ మూడినట్లే. తాజాగా పవన్ కల్యాణ్ అభిమానులు సాటి పవన్ అభిమానిపై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి'చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. అయితే
'అజ్ఞాతవాసి' సినిమాపై తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఓ అభిమాని సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశాడు. ఆ వీడియోలో పవన్ కల్యాణ్ పోస్టర్‌ను చెప్పుతో కొడుతున్నట్లు కనిపిస్తోంది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ అభిమానుల కంటపడింది.
తమ అభిమాన హీరోను మరో అభిమాని ఇంతలా కించపర్చడంతో వారు తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యారు. సదరు అభిమాని చిరునామా వెతికి మరీ అతన్ని పట్టుకున్నారు. 'జై పవనిజం' అన్న నినాదాలు చేస్తూ అతన్ని చితకబాదారు.