కత్తి మహేష్‌దే పై చేయి.. పవన్‌‌ దారిదే.. ఉండవల్లి సంచలనం..!

2018-01-17 491

Former MP Vundavalli Arun Kumar said Kathi Mahesh has scored over fans of Powerstar Pawan Kalyan in the issue. He said Mahesh seems to be well-educated and makes preparation before he participates in TV live debates.

రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఏపీ రాష్ట్రంలో బలోపేతమయ్యే అవకాశం ఉందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్‌ విషయంలో సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ చేస్తున్న ఆరోపణల విషయంలో పవన్ స్పందంచకుంటేనే ప్రయోజనం ఉంటుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
రాజకీయాల్లో ఉన్న నేతలు చాలా సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఓ తెలుగు ఛానెల్ ప్రస్తుత పరిణామాలపై ఉండవల్లి అరుణ్‌కుమార్ ‌ను ఇంటర్వ్యూ చేసిన సమయంలో అరుణ్‌కుమార్ ఈ విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఏపీ రాష్ట్రంలో ఓ పోర్స్‌గా తయారయ్యే అవకాశం ఉందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ విషయమై తనకు అనుమానం లేదన్నారు. అయితే పార్టీని నిలబెట్టుకోవడం పవన్ చేతుల్లో ఉంటుందన్నారు. అయితే ఆ విషయంలో వపన్ కళ్యాణ్ ఏ మేరకు విజయం సాధిస్తారో చూడాల్సిన అవసరం ఉందని అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ విషయంలో తొలుత కత్లి మహేష్ విమర్శలు చేసిన సమయంలో కొంత అర్ధవంతంగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో రొటీన్‌గా మారిందని ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. అయితే కత్తి మహేష్ తన వాదనను అద్భుతంగా సమర్థించుకొంటారని చెప్పారు. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడంలో కత్తి మహేష్ కొంత స్కోర్ చేసినట్టు కన్పిస్తోందన్నారు.ఈ తరహ విమర్శల విషయంలో మౌనంగా ఉండడమే పవన్ కళ్యాణ్‌కు ఉత్తమమని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

Videos similaires