మోడీతో పన్నీర్ సెల్వం భేటీ.. దినకరన్ కొత్త పార్టీ రోజు ఢిల్లీలో, చెక్!

2018-01-17 185

Tamil Nadu deputy CM Panneerselvam boarding to Delhi today afternoon to meet PM Modi and President Ramnath Kovind to invite them for MGR centenary function at Chennai.

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీ పర్యటన మొదలైయ్యింది. బుధవారం మద్యాహ్నం పన్నీర్ సెల్వం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పన్నీర్ సెల్వం పలు కీలక విషయాలు చర్చించనున్నారని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు అంటున్నాయి.
చెన్నైలోని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీటీవీ దినకరన్ తమిళనాడులో ఎలాగైనా ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చాలని సిద్దం అయ్యారు. ఇప్పటికే టీటీవీ దినకరన్ 18 మంది రెబల్ ఎమ్మెల్యేలను తయారు చేశాడు. కొత్త పార్టీ విషయం బుధవారం ప్రకటిస్తానని టీటీవీ దినకరన్ చెప్పారు.
విదేశాల నుంచి అక్రమ నగదు లావాదేవీలు, ప్రభుత్వాన్ని మోసం చేశారని, భారత ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి సిద్దం అయ్యారని టీటీవీ దినకరన్ మీద కేసులు నమోదు అయ్యాయి.
టీటీవీ దినకరన్ మీద ఎన్ని కేసులు నమోదు అయినా, ఐటీ శాఖ అధికారులు దాడులు చేసినా ఆయన మాత్రం భయపడటం లేదు. ప్రతిరోజు ఏదో ఒక విధంగా వివాదాస్పదవ్యాఖ్యలు చేస్తున్న టీటీవీ దినకరన్ మీడియాలో హాట్ టాఫిక్ అవుతున్నాడు.