మత్తులో యువతి వీరంగం.. పోలీసులకు చుక్కలు !

2018-01-17 971

79 persons arrested and 34 cars seized in Hyderabad on Tuesday night in drunk and drive case.

నగరంలోని రోజు రోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడుతున్నవారిసంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక, మద్యం మత్తులు డ్రైవింగ్ చేస్తూ యువతులు కూడా పోలీసులకు చిక్కుతుండటం గమనార్హం.
తాజాగా, మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌లో ఓ యువతి మద్యం సేవించి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే.. మంగళవారం అర్థరా​త్రి జూబ్లీహిల్స్ పరిధిలో ఆరు చోట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అతిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 79 మంది మందు బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా 34 కార్లు, 25 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లో ఓ యువతి మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తుండగా పోలీసులు ఆపారు. దీంతో పోలీసులతో యువతి వాగ్వాదానికి దిగింది. కొద్దిసేపు వీరంగం సృష్టించింది.
బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా చుక్కలు చూపింది. తాగిన పర్సంటేజ్ ఎక్కువ ఉండటంతో పారిపోయే యత్నించింది. పారిపోతున్న మహిళను ట్రాఫిక్, సివిల్ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.
చివరకు పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో అనేక ప్రమాదాలు జరిగి, ప్రాణాలు కోల్పోతున్నా మందుబాబులకు చైతన్యం రాకపోవడం శోచనీయం.