డెడ్‌లైన్ ఓవర్.. న్యాయం చేయండి.. 7 ప్రశ్నలకు సమాధానాలతో మహేష్ కత్తి!

2018-01-17 2,106

Kathi Mahesh reacts to Pawan Kalyan fans propaganda. Telugu film critic Mahesh Kathi is at the receiving end of hatred from fans of actor-turned-politician Pawan Kalyan.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ విమర్శకుడు మహేష్ కత్తి మధ్య రాజుకున్న వివాదం రోజు రోజుకూ ఎక్కువ అవుతుందే తప్ప తగ్గడం లేదు.
పవన్ మౌనాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలని మహేష్ కత్తిని సినీ రచయిత, పవన్ కళ్యాణ్ స్నేహితుడు కోన వెంకట్ సున్నితంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులు కూడా సంయమనం పాటించాలని కోన కోరాడు. జనవరి 15 వరకు అందరూ సైలెంటుగా ఉండాలని కోన వెంకట్ సూచించారు.కోన వెంకట్ ట్వీట్ ను గౌరవించి జనవరి 15 వరకు నేను కామ్ గా ఉన్నాను. జనవరి 16 వచ్చింది.... నాకు న్యాయం చేయండి అంటూ మహేష్ కత్తి మళ్లీ మీడియా ముందుకొచ్చారు.
నేను మా వూరికి వెళ్లడం లేదని, అందు కారణం మా ఫ్యామిలీ ఊర్లో మోసం చేసి వచ్చిందని పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రచారం చేశారని, ఈ ప్రచారం విని నా ఫ్యామిలీ బాధ పడుతోందని మహేష్ కత్తి తెలిపారు.
పవన్ ఫ్యాన్స్ 7 ప్రశ్నలకు మహేష్ కత్తి సమాధానాలు ఇచ్చారు. నీ తండ్రి వ్యవసాయ అధికారిగా ఎన్ని కోట్లు మింగాడు? అనే ప్రశ్నకు..ఆయ‌న రిటైర్ మెంటుతో వ‌చ్చిన డ‌బ్బుల‌తో మా ఊరిలో, మాకు ఉన్న స్థ‌లంలో చిన్న ఇల్లు క‌ట్టుకుని ఉంటున్నారు. కోట్లు ఉన్నాయ‌నేది ఫ్యాన్స్ ఊహించుకుని ఆరోపణ‌లు చేస్తున్నారు అని అన్నారు.