Superstar Kamal Haasan will announce his political party's name on February 21 at Tamil Nadu's Ramanathapuram and begin a state-wide tour the same day. The tour will be held in phases.
తమళనాడు రాజకీయాల్లోకి వస్తానని ఇప్పటికే ప్రకటించిన ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఇప్పుడు పార్టీ ఏర్పాటుపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే తన పార్టీపై పూర్తి స్పష్టతనిస్తూ ప్రజలకు, అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. కమల్‌హాసన్ ఫిబ్రవరి 21న పార్టీ పేరు ప్రకటించనున్నారు. అదేరోజు నుంచి తమిళనాడు వ్యాప్తంగా పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ప్రజల సమస్యలు, వారి అవసరాలు తెలుసుకోవడమే లక్ష్యంగా సాగుతుందని చెప్పారు.
తాను పుట్టిన రామనాథపురం నుంచి యాత్ర మొదలవుతుందని, మదురై, దిండిగల్, శివగంగ జిల్లాల్లో తొలి విడత పాదయాత్ర ఉంటుందని కమల్ హాసన్ తెలిపారు. తనపై ప్రజలు చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతగా వారికి ఏదైనా చేయాలన్న తలంపుతోనే తాను రాజకీయాల్లో వస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నడుస్తోందని, ప్రజా సంక్షేమ పాలనను తీసుకురావడమే తన లక్ష్యమని కమల్ తెలిపారు. తన యాత్రకు ప్రజలు అండగా ఉండాలని కోరారు.