సీఎంగా కుమారస్వామి ది బెస్ట్.. సీఎం సిద్దూకు మూడో స్థానం

2018-01-16 932

Bengaluru: A pre-poll survey by an agency, CHS, that predicts a hung assembly for Karnataka in May 2018, has raised quite a few eyebrows as it gives the Janata Dal(S) a whopping 65 seats and warns the ruling party could lose 40 to 50 seats in comparison to 2013.

మార్చి, ఏప్రిల్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో రాజకీయం ఇప్పుడిప్పుడే వేడెక్కుతున్నది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీజేపీ మధ్య నువ్వా? నేనా? అన్నట్లు వాగ్భాణాలు సంధించుకుంటున్నాయి. మరోసారి మెజారిటీ సామాజిక వర్గంగా ఉన్న హిందువులను ఆకట్టుకునే లక్ష్యంతో ఇరుపక్షాలు భావోద్వేగపూరిత వ్యాఖ్యలకు దిగుతున్న వేళ.. అధికార కాంగ్రెస్ పార్టీ మూడో పక్షం 'సీహెచ్ఎస్' ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే రాజకీయ పండితులనే అచ్చెరువొందిస్తున్నది. ఒకనాడు కన్నడ నేలపై మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ సారథ్యంలో కీలక భూమిక పోషించిన సెక్యులర్ జనతాదళ్ నాయకుడు, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామినే తమ సీఎం అభ్యర్థిగా ఎక్కువగా ఎంచుకుంటున్నారని తేలింది.
ఇక తదుపరి సీఎం తానేనని అంచనాల్లో ఉన్న మాజీ సీఎం - బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యెడ్యూరప్ప స్థానంలో ఉన్నారు. సరైన సీఎం అభ్యర్థిగా తదుపరి దశలో ప్రస్తుత సీఎం సిద్దరామయ్యకు కన్నడిగులు మూడో ప్రాథాన్యం ఇస్తున్నారు. ఇక జనతాదళ్ (ఎస్) 65 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది.