Tumhari Sulu done, Vidya Balan will now be busy with her new project, the rights of which she just acquired. The National Award-winning actress recently got the rights for Sagarika Ghose's book titled Indira - India'S Most Powerful Prime Minister and is thrilled about portraying the former prime minister.
ఇండియన్ సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా బయోపిక్‌ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల జీవితాల ఆధారంగా వచ్చిన చిత్రాలకు బాక్సాఫీసు వద్ద మంచి స్పందన రావడంతో మరిన్ని బయోపిక్ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ జీవితంపై మూడు చిత్రాలు రాబోతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా బాలీవుడ్లో భారత మాజీప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ రాసిన ‘ఇందిరా: ఇండియాస్ మోస్ట్ పవర్‌ఫుల్ పీఎం' బయోగ్రఫీ హక్కుల్ని కూడా విద్యా కొనుగోలు చేసింది. సినిమా లేదా వెబ్ సిరీస్ రూపంలో ఇందిరా గాంధీ జీవితాన్ని తెరకెక్కించాలని విద్యా బాలన్ యోచిస్తోందట.
ఇందిరాగాంధీగా విద్యా బాలన్ నటించడం సహించరాని విషయమని...... ‘లక్ష్మీస్ వీరగ్రంధం' చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒక గొప్ప మహిళా నాయకురాలి పాత్ర ను డర్టీ పిక్చర్ లాంటి చిత్రం లో నటించిన లేడీ చేయడం ఏమిటని ప్రశ్నించారు.
ఇందిరా గాంధీ పాత్రలో విద్యా బాలన్ నటించబోతున్నారనే వార్త ఇందిర అభిమానులను కలతకు గురి చేస్తుందని, వెంటనే ఆమె ఆ ప్రయత్నంను విరమించాలని కేతిరెడ్డి కోరారు.
ఈ దేశ సమైక్యత, సమర్గతలను కాపాడే ప్రయత్నంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక మహిళా నేత పాత్రలో విద్యా బాలన్ లాంటి నటిని ఊహించటం కష్టమని, ఆమె ఆ ప్రయత్నం మానుకోక పోతే ఇందిర అభిమానుల ఆగ్రహానికి గురికాక తప్పదని కేతిరెడ్డి హెచ్చరించారు.