హరీష్ రావు @ జయశంకర్ భూపాలపల్లి : SRSP మరమ్మత్తు పనులకు శంకుస్థాపన

2018-01-12 2,828

Telangana State Irrigation Minister Harish Rao Speech At SRSP Restoration Works Foundation Ceremony.

జయశంకర్ భూపాలపల్లి లో హరీష్ రావు పర్యటించారు. రేగొండ మండలంలో srsp కాలువ మరమ్మత్తు పనులకు శంకుస్థాపన. SRSP వరద కాలువ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దగ్గర మొదలై మిడ్ మానేరు ప్రాజెక్టు వరకు ఉంటుంది. దీని పొడవు 120 కిలోమీటర్లు. వరద కాలువ ప్రవాహాన్నే రిజర్వాయర్ గా వాడుకుంటూ నీళ్లను పైకి రివర్స్ పంపింగ్ చేసి.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేయాలన్న ఆలోచనతో పునరుజ్జీవన పథకాన్ని డిజైన్ చేశారు. దీని కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తెచ్చే నీళ్లనే ఉపయోగిస్తారు. అలాగే కాళేశ్వరం తరహాలోనే రివర్స్ పంపింగ్ చేస్తారు. ఇట్లా SRSP ఆయకట్టుతో పాటు దాని మీద ఆధారపడిన మిగిలిన లిఫ్ట్ లు, స్కీంలు, ఆయకట్టు స్థిరీకరణకు సరిపడా నీళ్లిచ్చే అవకాశం ఉంది. శ్రీరాంసాగర్ మీద ఆధారపడిన ఆయకట్టుతో పాటు లిఫ్టులు, స్కీంలకు సరిపడా నీళ్లివ్వాలంటే 95 టీఎంసీలు కావాలి. ఇంత స్థాయిల ప్రాజెక్టుల నీళ్లు ఉండట్లేదు. దీనికి నీళ్లివ్వగలిగితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. అందుకనే శ్రీరాంసాగర్ వరద కాలువ పునరుజ్జీవన పథకం చేపడుతోంది సర్కార్.
హరీష్ రావు శంకుస్థాపన అనంతరం మాట్లాడారు. గత 27 ఏళ్ళుగా dpm - 38 కాలువతో నీళ్ళు రాలేదు అని హరీష్ రావు అన్నారు. చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందిస్తాం అని మాట్లాడారు. 54 కోట్లతో మరమ్మత్త్హు పనులు చేస్తున్నాం అన్నారు. రైతు శ్రేయస్స్సు కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు.

Videos similaires