'అజ్ఞాతవాసి'పై ఓ అభిమాని ఆవేదన చుడండి !

2018-01-11 2,818

A fully dissappointed Pawan Kalyan fan talked about his frustration after watching Agnyaatahvasi movie on Monday.

ఉత్సాహం నీరుగారిపోయింది. ఎంత అభిమానం అడ్డొస్తున్నా సరే.. 'అజ్ఞాతవాసి'పై అభిమానులు సైతం బాహాటంగానే పెదవి విరుస్తున్న పరిస్థితి. సినిమా కౌంట్ డౌన్ దగ్గరపడుతున్న కొద్ది ఎప్పుడెప్పుడు సినిమా చూడాలని ఎంతలా ఆరాటపడ్డారో.. థియేటర్ లోపలికెళ్లాక.. ఎప్పుడెప్పుడు బయటపడుదామా? అన్నట్లుగా తీవ్ర అసహనానికి లోనయ్యారు. 'అజ్ఞాతవాసి'పై ఓ అభిమాని తన ఆవేదన.. అసహనాన్ని ఇలా వ్యక్తం చేసాడు. చావాల్నా.. బతకాల్నా.. ఇంత వరస్టుగా తీయడమేంది త్రివిక్రమ్, అసలేం అర్థంకాలే. ఆ పాటలేంది.. కనీసం దేవిశ్రీని పెట్టి ఉంటే బాగుండేది. ఇంతకుముందు పవన్ కల్యాణ్‌కు జల్సా, అత్తారింటికి దారేది.. ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఇప్పుడీ మ్యూజిక్ డైరెక్టర్అధ్వాన్నంగా చేసి పారేశాడు.
అసలు సినిమా దేని గురించి తీశాడో.. ఎందుకు తీశాడో.. ఓ ఇంట్రో లేదు.. పాటలు బాగా లేవు. సినిమా కోసం ఇంత ఖర్చు పెట్టుకుంటే ఏమి లాభమొచ్చే.. తలెత్తుకోలేకపోతున్నా. ఏడ్వడం ఒక్కటే తక్కువ.
పన్నెండున్నర ఒంటిగంటవరకు మేల్కొని తీరా సినిమాలో నిద్రపోతున్నామంటే లెక్కేసుకో.. సినిమా ఎంత వరస్టుగా తీశాడో. త్రివిక్రమ్ ఇంత చెత్త సినిమా తీస్తాడని కలలో కూడా అనుకోలేదు. సినిమా మొదలైన 20నిమిషాలకే అర్థమైంది ఇందులో దమ్ములేదని.

Free Traffic Exchange