Hyderabad HCU Student Ananya Lost life in Outer Ring Road Road Mishap. watch video
ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో యూపీకి చెందిన హెచ్‌సీయు విద్యార్థి అనన్య మృతి చెందిన విషయం తెలిసిందే. స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా అనన్య, ఆమె స్నేహితులు జతిన్, నిఖితలు అర్దరాత్రి వరకు రోడ్డుపై కారులో తిరిగారు. ఆ తర్వాత మంగళవారం వేకువజామున భోజనానికి వెళ్లే క్రమంలో అతివేగంగా కారు నడుపుతూ ప్రమాదానికి గురయ్యారు. శంషాబాద్ పోలీసులు చెప్పిన ప్రకారం యూపీకి చెందిన, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న అనన్య (21), నేపాల్‌కు చెందిన నిఖిత స్నేహితులు. నిఖిత స్నేహితుడు, గచ్చిబౌలిలో ఉంటూ ట్యాక్స్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న జోద్‌పూర్‌కు చెందిన జతిన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి ఇద్దరూ గచ్చిబౌలి వెళ్లారు.కారులోనే కేక్ కట్ చేశారు. పార్టీ చేసుకున్నారు. చాలాసేపు కారులో నగరంలో తిరిగారు. ఆ తర్వాత భోజనం చేయడానికి మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న డాబా వద్దకు వెళ్లాలనుకున్నారు.
దీంతో నగరం నుంచి అటు వైపు కారును తిప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ దిశగా వెళ్లారు. చీకట్లో అయోమయానికి గురై పెద్ద గోల్కొండ జంక్షన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కిందకు దిగారు. తర్వాత పీ1 రహదారిపై వస్తుండగా 3.20 గంటల ప్రాంతంలో బూర్జుగడ్డ తండా మలుపు వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు తిరగబడింది.