Nandamuri Balakrishna is going to build his own film studio in the new state of Andhra Pradesh. He said he has plans to build his own film studio in AP. However, this may take sometime.
ఇప్పటి వరకు నటుడిగా మాత్రమే కొనసాగిన నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ద్వారా నిర్మాతగా మారబోతున్నారు. అంతే కాదు త్వరలో ఆయన ఏపీ కొత్త రాజధాని అమరావతిలో సొంతగా ఫిల్మ్ స్టూడియో నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయని అంటున్నారు.
ప్రస్తుతం బాలయ్య సినిమా కెరీర్ వరుస విజయాలతో సూపర్బ్ గా సాగుతోంది. త్వరలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో తమకంటూ సొంతగా ఓ నిర్మాణ సంస్థ, ఫిల్మ్ స్టూడియో ఉంటే ఇండస్ట్రీపై మరింత పట్టుసాధించవచ్చనే అభిప్రాయంలో బాలయ్య ఉన్నట్లు సమాచారం.
సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నుండి అమరావతి షిప్ట్ అవ్వాలనే వాదనతో మాత్రం బాలయ్య ఏకీభవించడం లేదు. రెండు రాష్ట్రాల్లో ఉండేది తెలుగు ప్రజలే, అందరూ చూసేది తెలుగు సినిమాలే, సినిమా పరిశ్రమ షిప్ట్ అవ్వాల్సిన అసవరం లేదని బాలయ్య అభిప్రాయ పడుతున్నారు.
ఏపీలో ఫిల్మ్ స్టూడియోలు నిర్మించడానికి అనుకూలమైన వాతావరణం, అందమైన లొకేషన్లు ఉన్నాయి. అక్కడ ఎవరైనా స్టూడియోలు నిర్మించాలనుకోవడం వ్యక్తిగత నిర్ణయం అని బాలకృష్ణ అభిప్రాయ పడ్డట్లు సమాచారం.