Another Nagarkurnool Swathi Found : మరో స్వాతి: ప్రియుడితో రాసలీలలు, హత్య

2018-01-05 36

In yet another case of plan of a husband by the wife, the Hyderabad Police stumbled upon a case where one of the supari gang members revealed a ghastly incident.

నాగర్ కర్నూల్ స్వాతి తరహ కేసు మరోటి చోటు చేసుకొంది. ప్రియుడితో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సహయంతో భర్తను చంపేసింది భార్య. అయితే ఈ ఘటనలో జ్యోతి ఉపయోగించిన ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. అయితే అదే సమయంలో ఈ ఘటనలో పాల్గొన్న నరేష్ కూడ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఈ కేసు చిక్కుముడి వీడింది.ఈ ఘటన హైద్రాబాద్ కర్మన్‌ఘాట్‌లో చోటు చేసుకొంది. ప్రియుడితో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్యే ఈ దారుణానికి ఒడిగట్టింది.
అయితే పోలీసులకు అనుమానం రాకుండా జ్యోతి వ్యవహరించింది.పోస్ట్‌మార్టం నివేదికలో మృతదేహం తల వెనుక భాగంలో తీవ్ర గాయాలున్నాయని గుర్తించారు. దీంతో కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా రాచర్లకు చెందిన జ్యోతి అదే గ్రామానికి చెందిన నాగరాజుతో ఐదేళ్ళ క్రితం వివాహమైంది. అయితే వివాహనికి ముందే జ్యోతి కార్తీక్‌ అనే యువకుడితో ప్రేమలో పడింది. వారిద్దరూ పెళ్ళి చేసుకోవాలని భావించారు. కానీ, నాగరాజుతో తల్లిదండ్రులు వివాహం చేశారు.నాచారంలో ఉంటున్న మేనమామ ఇంటికి వెళ్ళే సమయంలో కార్తీక్‌తో జ్యోతికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి కూడ దారితీసింది. అయితే తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని వారిద్దరూ కలిసి భర్త నాగరాజును హత్య చేశారు.